Corona Positive: సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో కరోనా కలకలం.. ఒక్కరోజే ఎనిమిది మందికి పాజిటివ్..

|

Jan 25, 2022 | 4:36 PM

అనంతపురం జిల్లా ఉరవకొండ బాలయోగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ పాఠశాలలో 25 మందికి కరోనా పరీక్షలు చేయగా ఎనిమిది మందికి కరోనా..

Corona Positive: సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో కరోనా కలకలం.. ఒక్కరోజే ఎనిమిది మందికి పాజిటివ్..
Coronas Virus
Follow us on

Coronavirus Positive: కరోనా రోజు రోజుకు మరింత భయపెడుతోంది. వారిని వీరిని అని తేడా లేకుండా అన్ని వర్గాల వారిని పట్టిపీడిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో కొన్ని రోజుల నుంచి విద్యారంగం కూడా తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. కఠిన కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఆ మహమ్మారి వెంటాడుతూనే ఉంది. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ బాలయోగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ పాఠశాలలో 25 మందికి కరోనా పరీక్షలు చేయగా ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే స్కూల్‌లోని ఐదుగురు ఉపాధ్యాయులతోపాటు ముగ్గురు విద్యార్థులకు కోవిడ్ సోకింది.

దీంతో గురుకులంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గురుకులంలో ప్రభుత్వం వంద పడకల కరోనా ఐసోలేషన్ కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఉరవకొండ బాలయోగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో వైద్యులు గురుకులానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Telangana Corona: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్..

UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జలాల్‌పూర్ ఎమ్మెల్యే..