Indu Jain: కరోనా మహమ్మారి ధాటికి నేలరాలిన ఆణిముత్యం.. టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందూ‌జైన్ కన్నుమూత

|

May 14, 2021 | 8:33 AM

కరోనా వైరస్ దేశంలో వినాశనం చేస్తూనే ఉంది. చైనా నుండి వచ్చిన ఈ ప్రమాదకరమైన వైరస్ గతేది కాలంగా విలయతాండవం చేస్తోంది. తాజాగా టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందూ జైన్ కరోనాతో కన్నుమూత.

Indu Jain: కరోనా మహమ్మారి ధాటికి నేలరాలిన ఆణిముత్యం.. టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందూ‌జైన్ కన్నుమూత
Times Group Chairperson Indu Jain
Follow us on

Times Group chairperson Indu Jain: కరోనా వైరస్ దేశంలో వినాశనం చేస్తూనే ఉంది. చైనా నుండి వచ్చిన ఈ ప్రమాదకరమైన వైరస్ గతేది కాలంగా విలయతాండవం చేస్తోంది. వేలాది మంది ప్రముఖులను సైతం పొట్టన బెట్టుకుంటోంది. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల దాకా ఎవరిని వదలడం లేదు. తాజాగా టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందూ జైన్ కరోనా బారినపడి ప్రాణాలను విడిచారు. భారతదేశంలో మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

ఆమె గత కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ గురువారం సాయంత్రం ఇందూ జైన్ తుదిశ్వాస విడిచారు. 84 ఏళ్ల ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. జీవితకాల ఆధ్యాత్మిక అన్వేషకులు, మార్గదర్శక పరోపకారిగా, కళల విశిష్ట పోషకులుగా విశేష కృషీ చేశారు. మహిళల హక్కుల కోసం నిరంతరాయంగా పోరాటం చేస్తున్నారు. సమాజ సేవ పట్ల నిర్విరామంగా శ్రమించారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 2016లో ఆమెను పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేసి సత్కరించింది.

టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందూ‌జైన్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందూ జైన్ సమాజ సేవా కార్యక్రమాలు, భారతదేశం పురోగతి పట్ల అభిరుచి,సంస్కృతిపై ఆసక్తి ఉన్న వ్యక్తి అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇందూజైన్ 84 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఇందూ జైన్‌ను జీవితకాల ఆధ్యాత్మిక అన్వేషకురాలు, మార్గదర్శక పరోపకారి, కళల విశిష్ఠ పోషకురాలు అని పేర్కొన్నారు. ఇందూ జైన్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రధాని మోదీ తెలిపారు. ఇందూ జైన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు పద్మ అవార్డు లభించింది.



Read Also… Black fungus: తెలంగాణలో కొత్త గుబులు.. కరోనా తగ్గి, బ్లాక్ ఫంగస్ విజృంభణ.. వాటి వాడకం తగ్గించాలంటున్న నిపుణులు