Corona Fear: సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కనిపించని ఆంక్షలు.. నిర్మల్ జిల్లా భైంసాను వెంటాడుతున్న కరోన భయం..

నిర్మల్ జిల్లా భైంసాను కరోన భయం వెంటాడుతోంది. మహారాష్ట్రలో ఒకవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. గతంలో నాందేడ్ నుంచే భైంసా పరిసర ప్రాంతాల్లో..

Corona Fear: సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కనిపించని ఆంక్షలు.. నిర్మల్ జిల్లా భైంసాను వెంటాడుతున్న కరోన భయం..
Corona

Updated on: Dec 12, 2021 | 9:26 AM

నిర్మల్ జిల్లా భైంసాను కరోన భయం వెంటాడుతోంది. మహారాష్ట్రలో ఒకవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. గతంలో నాందేడ్ నుంచే భైంసా పరిసర ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు భైంసాలో టీకాలు వేసుకొని వారిని గుర్తించి మరీ టీకాలు వేయిస్తున్నారు అధికారులు. అయితే సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఎత్తి వేయడంతో ఎక్కడా కరోనా నిబంధనలు పాటించడం లేదు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు ఆనుకోని భైంసా, తనూర్, కుభీర్, కుంటాల మండలాలు ఉన్నాయి. నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు ప్రజలు. దీంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రపంచ దేశాలను చుట్టేస్తూ అలజడి సృష్టిస్తోంది కొవిడ్‌ మహమ్మారి. కొత్త కొత్త వేరియంట్లతో.. ఎప్పటికప్పుడు సవాల్‌ విసురుతోంది. కట్టడి చర్యలు చేపడుతోన్నా.. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఈ బంధాలను వెంటనే వదిలివేయండి.. కీలక వివరాలను వెల్లడించిన చాణక్యుడు..

Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌..!