షాకింగ్: 2,416 మంది పోలీసులకు కరోనా వైరస్..

| Edited By:

May 31, 2020 | 3:04 PM

ప్రస్తుతం భారత్‌లోని మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కరోనా సమయంలో డ్యూటీలు చేస్తున్న పోలీసులు, డాక్టర్లకు కూడా ఈ వ్యాధి సోకడంతో..

షాకింగ్: 2,416 మంది పోలీసులకు కరోనా వైరస్..
Follow us on

ప్రస్తుతం భారత్‌లోని మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కరోనా సమయంలో డ్యూటీలు చేస్తున్న పోలీసులు, డాక్టర్లకు కూడా ఈ వ్యాధి సోకడంతో ఇప్పుడు భయాందోళనలు మొదలయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 91 మంది పోలీసులు ఈ కరోనా బారినపడ్డారు. దీంతో కోవిడ్ సోకిన పోలీసుల సంఖ్య 2,416కి చేరింది. వీరిలో ఇప్పటివరకూ 26 మంది మృత్యువాత పడ్డారు. అయితే వీరిలో 969 మంది పోలీసులు ఈ వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం మరో 1421 మంది చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం వైరస్ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కనీసం మూడు అడుగుల దూరంలో కూర్చునే ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా పగలు ఆఫీసుల్లో ఉండే కిటికీలను పూర్తిగా తెరిచి ఉంచుకోవాలని పేర్కొంది. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరింది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ మహారాష్ట్ర వ్యాప్తంగా 65,168 మంది కరోనా వైరస్ బారిన పడగా.. వీరిలో 2197 మంది మృత్యువాత పడ్డారు.

ఇది కూడా చదవండి:

బికినీ, లిప్‌లాక్‌ సీన్లపై కీర్తి కామెంట్స్..

ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ..

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?