లాక్‌డౌన్‌లోనూ శ్రమిస్తున్న కార్మికుడిపై డబ్బులు, పూల వర్షం

| Edited By:

Apr 01, 2020 | 11:35 AM

దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తున్న వేళ, ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని శ్రమిస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడిపై స్థానికులు పూలవర్షం కురిపించారు. అంతేకాకుండా.. అతని మెడలో నోట్ల దండలు వేసి..

లాక్‌డౌన్‌లోనూ శ్రమిస్తున్న కార్మికుడిపై డబ్బులు, పూల వర్షం
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తున్న వేళ, ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని శ్రమిస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడిపై స్థానికులు పూలవర్షం కురిపించారు. అంతేకాకుండా.. అతని మెడలో నోట్ల దండలు వేసి.. అతని సేవలను కొనియాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పంజాబ్‌లోని పటియాల జిల్లాలో నభా కాలనీలో జరిగింది. క్రమం తప్పకుండా తమ వీధిలోకి వచ్చి చెత్తను సేకరించే ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. లాక్‌డౌన్ సమయంలోనూ తన విధులను మర్చిపోలేదు. దీంతో అతనికి చప్పట్లతో స్వాగతం పలికిన ఓ కాలనీ వాసులు.. అతనిపై పూల వర్షం కురిపించారు. మరికొందరైతో నోట్ల దండలు కార్మికుడి మెడలో వేసి అభినందించారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేసేయండి.

ఇవి కూడా చదవండి: 

కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు

లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

కరోనా వైరస్: ప్రపంచంలో టాప్ 10 హై రిస్క్ అండ్ సేఫ్ కంట్రీస్ ఇవే!

వైన్స్‌‌ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్

క్రికెటర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

భారత్‌లో ఒక్క రోజులోనే 45కి చేరిన మృతుల సంఖ్య

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..

అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ

వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’