రాచకొండ పోలీసులను వెంటాడుతున్న కరోనా

|

Jul 06, 2020 | 3:41 PM

Corona Chasing The Police of  Rachakonda : కరోనా వైరస్ మహమ్మారి మహారాష్ట్ర పోలీసులనే కాదు ఇప్పుడు తెలంగాణ పోలీసులను కూడా  వేధిస్తోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 53 మంది సిబ్బందికి కరోన సోకిందని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. కరోనా సోకినవారికి వైద్యచికిత్స అందిస్తున్నామని తెలిపారు. కరోనా సోకిందని తెలిసినా ఎవరూ భయపడవద్దని అన్నారు. సరైన ఆహారం, జాగ్రతలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని సూచించారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. త్వరలో […]

రాచకొండ పోలీసులను వెంటాడుతున్న కరోనా
Follow us on

Corona Chasing The Police of  Rachakonda : కరోనా వైరస్ మహమ్మారి మహారాష్ట్ర పోలీసులనే కాదు ఇప్పుడు తెలంగాణ పోలీసులను కూడా  వేధిస్తోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 53 మంది సిబ్బందికి కరోన సోకిందని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. కరోనా సోకినవారికి వైద్యచికిత్స అందిస్తున్నామని తెలిపారు. కరోనా సోకిందని తెలిసినా ఎవరూ భయపడవద్దని అన్నారు. సరైన ఆహారం, జాగ్రతలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని సూచించారు.

ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. త్వరలో రాచకొండ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లుగా సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే ఫైన్‌లు విధిస్తామన్నారు. కొవిడ్ ఆంక్షలను  పాటించకుండా వేడుకలు, ఉత్సవాలను నిర్వహిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.