Prakasam District: ప్రకాశం జిల్లాలో దడ పుట్టిస్తోన్న కరోనా కేసులు.. పలు మండలాల్లో ఆంక్షలు

|

Aug 08, 2021 | 11:40 AM

ప్రకాశం జిల్లాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. థర్డ్‌ వేవ్‌ రాకముందే...సెకండ్‌ ఇన్నింగ్స్‌ దడ పుట్టిస్తోంది. సీజనల్‌ వ్యాధులతో...

Prakasam District: ప్రకాశం జిల్లాలో దడ పుట్టిస్తోన్న కరోనా కేసులు.. పలు మండలాల్లో ఆంక్షలు
Corona
Follow us on

ప్రకాశం జిల్లాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. థర్డ్‌ వేవ్‌ రాకముందే…సెకండ్‌ ఇన్నింగ్స్‌ దడ పుట్టిస్తోంది. సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పొదిలి, కొత్తపట్నం, సింగరాయకొండ, కొండపి మండలాల్లో కరోనా ఆంక్షలు విధించారు. అవగాహన లోపం..నిర్లక్ష్యం..కారణం ఏదైనా పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అధిక సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. ఒక ఇంట్లోనే రెండు, మూడు కేసులు నమోదు అవుతుండటంతో కుటుంబ సభ్యుల్లో భయం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు తక్కువగానే జరుగుతున్నాయి. ప్రైమరీ, సెకండరీ కేసులను గుర్తించి పరీక్షలు చేస్తే మరిన్ని పాజిటివ్‌లు వెలుగులోకి వచ్చే అవకాశముంది. పల్లెల్లో అనేకచోట్ల వ్యవసాయ, ఉపాధిహామీ పనులకు వెళ్తున్నవారు గుంపులుగా ఒకేచోట పనిచేస్తుండటం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. దాంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పల్లెలకు రాకపోకలు పెరగడం, మాస్కు, భౌతికదూరం, అవగాహనలేమి వైరస్‌ వ్యాప్తికి కారణంగా మారాయి.

మరోవైపు తీవ్రత తక్కువగా ఉన్న పాజిటివ్‌ వ్యక్తులు వ్యక్తిగత అవసరాల కోసం బయట తిరుగుతున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రికి వెళ్లకుండా సొంతంగానే మందులు వాడుతూ గోప్యంగా ఉంచుతున్నారు. ఇక సెకండ్‌వేవ్‌ పూర్తిగా తగ్గిపోలేదని వైద్యులు చెబుతున్నారు. కేసులు పెరుగుతుండటమే దానికి నిదర్శనమని అంటున్నారు. కాగా జాగ్రత్తలు పాటించకుండా అశ్రద్ద చేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం అస్సలు మరవవద్దని హెచ్చరిస్తున్నారు.

Also Read: తూర్పు గోదావరి జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ టెర్రర్.. తాజాగా ఇద్దరు మృతి

 రియల్టర్ కిడ్నాప్.. సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు