Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. గత నెల రోజు క్రితం తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 35,871 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 35 వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,74,605కు చేరింది. ఇందులో 2,52,364 యాక్టివ్ కేసులు ఉండగా, 1,10,63,025 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 172 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,58,725కు చేరుకుంది. నిన్న కొత్తగా 1,59,216 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Telangana Budget 2021 Highlights: తెలంగాణ పద్దు – రూ.2,30,825.96 కోట్లు.. ఏ రంగానికి ఎంత..?