Corona Cases: మరోసారి భయపెడతున్న కరోనా తీవ్ర రూపం.. మళ్లీ 200కు చేరువలో కోవిడ్ మరణాలు..

|

Mar 17, 2021 | 12:33 PM

24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 28,903 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 28వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది.

Corona Cases: మరోసారి భయపెడతున్న కరోనా తీవ్ర రూపం.. మళ్లీ 200కు చేరువలో కోవిడ్ మరణాలు..
Covid-19 India news
Follow us on

Corona Cases In India: భారత్‌లో కరోనా వైరస్‌ మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 28,903 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 28వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది. ఇందులో 2,34,406 యాక్టివ్ కేసులు ఉండగా, 1,10,457,284 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 188 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,59,044కు చేరుకుంది. నిన్న కొత్తగా 17,741 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24గంటల్లో 21లక్షల మందికి టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 3,50,64,536కి చేరింది.

కొన్ని నగరాల్లో నైట్‌ కర్ఫ్యూ…

ఇప్పటికే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పలు నగరాల్లో నైట్‌ కర్ఫ్యూ విధించారు. పరిస్థితి అదుపు తప్పడంతో కేంద్రం సీరియస్‌ అయ్యింది. మరోవైపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ఈరోజు నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలపై చర్చిస్తారు. వ్యాక్సినేషన్‌ పంపిణీపై కూడా ముఖ్యమంత్రుల నుంచి సమాచారం సేకరిస్తారు ప్రధాని. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

61శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే…

మహారాష్ట్రలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని , టెస్టింగ్‌ , ట్రేసింగ్‌ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కరోనా నియంత్రణకు కఠినచర్యలు తీసుకోవాలని మహా సర్కార్‌కు సూచించింది. మహారాష్ట్రలో ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించారు.

మహారాష్ట్రలో నమోదవుతున్న రోజువారీ కేసులు దేశాన్ని కలవరపెడుతున్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కొత్త కేసుల సంఖ్య 17వేలు దాటడం గమనార్హం. మంగళవారం 17,864మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 61శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చివరిసారిగా గతేడాది సెప్టెంబరులో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 23,47,328కి చేరింది.

ఇవి కూడా చదవండి

Rs.10 Biryani: ఘుమ ఘుమలాడే హైదరాబాదీ బిర్యానీ రూ.10కే.. ఎక్కడో తెలుసా..!

విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొత్త భయం.. దడ పుట్టిస్తున్న కరోనా.. హాట్‌స్పాట్స్‌గా గురుకుల పాఠశాలలు..

 AP MLC Election Results 2021 LIVE: కొనసాగుతున్న ఉపాధ్యయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఫలితాలు ఎప్పుడంటే..!