Corona: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఏకంగా 98.32 శాతానికి పెరిగిన రికవరీ రేటు..

|

Nov 23, 2021 | 10:38 AM

Corona: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఏకంగా 543 రోజుల కనిష్ట స్థాయికి ఈ సంఖ్య చేరుకుంది. దీనిబట్టే దేశంలో కరోనా కేసులు ఏ రేంజ్‌లో తగ్గుముఖం పట్టాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా...

Corona: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఏకంగా 98.32 శాతానికి పెరిగిన రికవరీ రేటు..
India Corona Cases
Follow us on

Corona: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఏకంగా 543 రోజుల కనిష్ట స్థాయికి ఈ సంఖ్య చేరుకుంది. దీనిబట్టే దేశంలో కరోనా కేసులు ఏ రేంజ్‌లో తగ్గుముఖం పట్టాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా లెక్కలను విడుదల చేసింది. దీని ప్రకారం సోమవారం దేశవ్యాప్తంగా 9,64,980 మంది కరోనా పరీక్షలు నిర్వహించుకోగా వారిలో 7,759 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇదిలా ఉంటే కేరళలో మాత్రం 3,698 కేసులు నమోదం కావడం గమనార్హం. అంటే దేవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపు సగం కేసులు కేరళలోనే నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు.

ఇక కేరళలో కరోనా కారణంగా 180 మంది మరణించగా దేశవ్యాప్తంగా 236 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఉంటే కరోనా నుంచి కోలుకుంటోన్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రికవరీ రేటు 98.32 శాతానికి పెరిగింది. ఇక ఇప్పటి వరకు మొత్తం 3.45 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 4,66,147 మంది మృత్యవాత పడ్డారు. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 117 కోట్లకుపైగా డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ చేయగా, నిన్న ఒక్క రోజే 71,92,154 మంది టీకా వేయించుకున్నారు.

Also Read: IPL 2022: చెన్నైతో ఆ ప్లేయర్ బంధం ముగిసినట్టేనా? వేలానికి ముందు బిగ్‌‌న్యూస్ చెప్పిన సీఎస్‌కే సీఈవో..!

Wine Shop Attack: మద్యం షాపులోకి దూసుకెళ్లిన మహిళలు.. తమ సమస్యను తామే పరిస్కారం.. వైరల్‎గా మారిన వీడియో..

AP To Receive Heavy Rainfall: ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు.. ఆ జిల్లాల ప్రజలకి అలెర్ట్.. (వీడియో)