ఇండియాలో కరోనా.. లక్ష దాటిన వైరస్ కేసులు..

ఇండియాలో కరోనా వైరస్ కేసులు లక్ష దాటాయి. మృతుల సంఖ్య 3,163 కి చేరింది. గత 24 గంటల్లో 4,970 కేసులు నమోదు కాగా.. 134 మంది మృతి చెందారని, మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,139 కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో యాక్టివ్ కేసులు 58,802 కాగా.. 39,173 మంది రోగులు కోలుకున్నారని పేర్కొంది. ఇక మన దేశంలో కరోనా కేసులు 100నుంచి లక్షకు చేరుకోవడానికి సుమారు 64 రోజులు పట్టిందని, […]

ఇండియాలో కరోనా.. లక్ష దాటిన వైరస్ కేసులు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 19, 2020 | 2:04 PM

ఇండియాలో కరోనా వైరస్ కేసులు లక్ష దాటాయి. మృతుల సంఖ్య 3,163 కి చేరింది. గత 24 గంటల్లో 4,970 కేసులు నమోదు కాగా.. 134 మంది మృతి చెందారని, మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,139 కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో యాక్టివ్ కేసులు 58,802 కాగా.. 39,173 మంది రోగులు కోలుకున్నారని పేర్కొంది. ఇక మన దేశంలో కరోనా కేసులు 100నుంచి లక్షకు చేరుకోవడానికి సుమారు 64 రోజులు పట్టిందని, కానీ అమెరికాలో వంద రోజుల నుంచి లక్ష కేసులకు చేరుకోవడానికి 25 రోజులు, ఇటలీలో 36, బ్రిటన్ లో 42, ప్రాన్స్ లో 39 రోజులు పట్టిందని, జర్మనీలో 35, స్పెయిన్ లో 30 రోజులు పట్టిందని ఈ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఇండియాలో రీకవరీ రేటు కూడా పెరుగుతున్న విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది.