AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. విపరీతంగా పెరుగుతోన్న కేసుల సంఖ్య

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 499 పాజిటివ్ కేసులు...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. విపరీతంగా పెరుగుతోన్న కేసుల సంఖ్య
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2020 | 9:44 AM

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 499 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 6,526కి చేరింది. ఇందులో 2,976 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,352 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 198 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఇవాళ కరోనాతో ముగ్గురు మరణించగా.. 51 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క గ్రేటర్ పరిధిలోనే 329 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డిలో 129 కేసులు, మేడ్చల్ 4, మంచిర్యాల 4, సంగారెడ్డి 1, మహబూబ్ నగర్ 6, ఖమ్మం 2, సూర్యాపేట 2, నల్గొండ 4, నిజామాబాద్ 4, కరీంనగర్ 1, జగిత్యాల 1, వరంగల్ అర్బన్ 4, జనగాంలో 7 కేసులు నమోదయ్యాయి. అటు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 2,477 కరోనా టెస్టులు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీనితో మొత్తంగా కరోనా టెస్టుల సంఖ్య 50,569కి చేరుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రైవేట్ ల్యాబ్స్ లలో టెస్టులు నిర్వహిస్తుండగా.. అందులో 8 ల్యాబ్స్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.

ఇక ఏపీ విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 465 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,961కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 376 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రంలో నాలుగు మరణాలు సంభవించాయి. అందులో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 96కి చేరింది. అలాగే 3,960 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో తాజాగా 17,609 పరీక్షలు నిర్వహించగా.. అందులో 376 కొత్త కేసులు వచ్చాయి. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6230కు చేరింది.  వారిలో తాజాగా 82 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం డిశ్చార్జి సంఖ్య 3,065కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 3,069 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 19 మందికి కరోనా సోకగా.. వారికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 308కు చేరింది. అందులో 261 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.