తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. భయాందోళనలో ప్రజలు

| Edited By:

Jun 16, 2020 | 7:20 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 219 కరోనా కేసులు...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. భయాందోళనలో ప్రజలు
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 219 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి ఇద్దరు మృతిచెందారు. నేటితో రాష్ట్రంలో మొత్తం 5,193 కేసులు నమోదుకాగా.. 187 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఒక్కరోజే 189 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి లో 2, మేడ్చల్ లో 2, రంగారెడ్డిలో 13, వరంగల్ అర్బన్ 4, వరంగల్ రూరల్ 3, మహబూబ్ నగర్, మెదక్ , అదిలాబాద్ , యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రం 2,766 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందున్న యాక్టివ్ కేసుల సంఖ్య 2, 240 ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక ఏపీ విషయానికొస్తే.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 304 పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 246 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 52 మంది, విదేశాలకు చెందినవారు 8 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మరణించారు. 47మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5087కి చేరింది. ఇప్పటివరకు 2770 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2231. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 86కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Read More: 

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్..

బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి