
తెలంగాణలో గత మూడు నాలుగు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. సోమవారం నాటికి రాష్ట్రంలో 364 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద సంక్షోభంగా మారిందని.. మన భారత్‌లాంటి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో.. లాక్‌డౌన్ విధించడమే దీనికి పరిష్కారమన్నారు. దీనికి విరుగుడుగా లాక్ డౌన్ కాకుండా మరో గత్యంతరం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధాని మోదీతో చెప్పినట్లు కేసీఆర్ అన్నారు.
ఇక ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నారు. అందులో మొదటిది వైద్యం కాగా.. రెండోది శానిటైజేషన్ అని.. మూడోది పోలీస్ వ్యవస్థ అని.. ఇక చివరగా.. స్వీయ నియంత్రణ అన్నింటికన్నా ముఖ్యమైందన్నారు.