యూపీలోని తబ్లీఘీ జమాత్ చీఫ్‌ బంధువులిద్దరికీ కరోనా..

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక యూపీలో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఇక్కడ మర్కజ్ సమావేశాలకు సంబంధించిన కాంటాక్ట్‌ కేసులు ఇప్పుడు బయటపడుతున్నాయి. తాజాగా.. తబ్లీగీ జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్ బంధువులిద్దరికి కరోనా మహమ్మారి సోకింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ నగరానికి చెందిన మౌలానా సాద్ ఖాంధాల్వీకి సమీప బంధువులిద్దరు.. మొహల్లా ముఫ్తీలుగా పనిచేస్తున్నారు. అయితే ముఫ్తీలుగా పనిచేస్తున్న ఇద్దరు.. గత మార్చి నెలలో […]

యూపీలోని తబ్లీఘీ జమాత్ చీఫ్‌ బంధువులిద్దరికీ కరోనా..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 16, 2020 | 9:16 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక యూపీలో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఇక్కడ మర్కజ్ సమావేశాలకు సంబంధించిన కాంటాక్ట్‌ కేసులు ఇప్పుడు బయటపడుతున్నాయి. తాజాగా.. తబ్లీగీ జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్ బంధువులిద్దరికి కరోనా మహమ్మారి సోకింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ నగరానికి చెందిన మౌలానా సాద్ ఖాంధాల్వీకి సమీప బంధువులిద్దరు.. మొహల్లా ముఫ్తీలుగా పనిచేస్తున్నారు.

అయితే ముఫ్తీలుగా పనిచేస్తున్న ఇద్దరు.. గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ తబ్లీఘీ జమాత్ సమావేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని తేలిందని సహరాన్ పూర్ జిల్లా అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిద్దరినీ ఫతేపూర్‌లోని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు.. వీరిద్దరు నివాసమున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ హాట్‌స్పాట్‌గా గుర్తించి.. అధికారులు పూర్తిగా శానిటైజేషన్ చేశారు. మర్కజ్‌ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారు ఇంకా ఎవరైనా ఉంటే.. వెంటనే వచ్చిన కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

కాగా.. రాష్ట్రంలోని ఈ ఒక్క సహరాన్‌పూర్ జిల్లాలోనే.. మర్కజ్ తబ్లీఘీ జమాత్ సమావేశానికి వెళ్లివచ్చిన 44 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లాలో 19 కరోనా హాట్‌స్పాట్‌లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు యూపీలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య ఏడు వందలకు చేరింది. అంతేకాదు.. బుధవారం నాటికి రాష్ట్రంలో కరోనా బారినపడి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?