Collector Apologises: కరోనా కట్టడిలో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడంలో భాగంగా అధికారులు కొన్ని సందర్భాల్లో అతిగా ప్రవర్తిస్తున్న సందర్భాలను కూడా చూస్తున్నాం. సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తోన్న వారికి లాఠీతో సమాధానం చెబుతున్నారు. ప్రతీ రోజూ ఇలాంటి సంఘటనలు ఏదో ఒకటి సోషల్ మీడియలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా చత్తీస్‌ఘడ్‌లోని సురజ్‌పూర్ కలెక్టర్ రన్బీర్ శర్మ.. లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘించాడంటూ ఓ యువకుడిని రోడ్డుపైనే చెంపపై కొట్టారు. అంతటితో ఆగకుండా యువకుడి చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కొని నేలపై విసిరికొట్టారు. దీంతో ఈ సంఘటనంతటినీ అక్కడే ఉన్న కొందు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. యువకుడిని కొట్టడం, మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేయడం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అధికారి తీరును తప్పు పడుతూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.
ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో వ్యవహారంపై కలెక్టర్ రన్బీర్ స్పందించారు. తాను చెంపపై కొట్టిన యువకుడికి క్షమాపణలు చెప్పారు. అయితే తాను ఆ యువకుడిని దండించడానికి గల కారణాన్ని వివరిస్తూ.. మొదట ఆ యువకుడు తాను వ్యాక్సినేషన్ కోసం బయటకు వచ్చానని చెప్పాడు. కానీ అతని దగ్గర దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై ప్రశ్నించడంతో తన తాతయ్యను కలవడానికి వెళుతున్నానని పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆ క్షణంలో కోపంలో అతన్ని కొట్టేశాను. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్నట్లు ఆయన వయసు 13 ఏళ్లు కాదు 23-24 ఉంటుంది. ఏది ఏమైనా నేను చేసిన దానికి క్షమాపణలు చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడా అధికారి.
He said he was out for vaccination but there was no proper document. Later, he said he was going to visit his grandmother. I slapped him in heat of moment when he misbehaved. He was 23-24 y/o & not 13. I regret & apologise for my behaviour: Surajpur Dist Collector #Chhattisgarh pic.twitter.com/myfhgPjTm0
— ANI (@ANI) May 22, 2021
ఇక తాను చేసిన తప్పుకు చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణాలు చెప్పిన కలెక్టర్‌కు వేటు తప్పలేదు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడంటూ యువకుడిపై చేయి చేసుకున్నందుకు గాను కలెక్టర్ రన్బీర్ శర్మను తొలగిస్తూ చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అదేశాలు జారీ చేశారు. ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని ప్రకటన చేశారు.
सोशल मीडिया के माध्यम से सूरजपुर कलेक्टर रणबीर शर्मा द्वारा एक नवयुवक से दुर्व्यवहार का मामला मेरे संज्ञान में आया है।
यह बेहद दुखद और निंदनीय है। छत्तीसगढ़ में इस तरह का कोई कृत्य कतई बर्दाश्त नहीं किया जाएगा।
कलेक्टर रणबीर शर्मा को तत्काल प्रभाव से हटाने के निर्देश दिए हैं।
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 23, 2021
Anandayya Corona Medicine: ఆనందయ్యది ఆయుర్వేదమా? నాటు మందా?.. ఆయుష్ కమిషనర్ క్లారిటీ