
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. వలస కార్మికుల కోసం కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంటాక్ట్ ట్రేసింగ్‌ను మరింత సులభతరం చేస్తూ ఆన్‌లైన్ డాష్ బోర్డును ప్రారంభించింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుబడిన వలస కార్మికుల తరలింపు సజావుగా జరిగేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ.. నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పేరిట.. ఓ ఆన్ లైన్ డాష్ బార్డును ఏర్పాటు చేసిందని.. హోం కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు.
ఈ పోర్టల్.. వలస కార్మికుల తరలింపులో రాష్ట్రాలకూ, జిల్లాలకూ తోడ్పడుతుందని, సెంట్రల్ సమన్వయ వ్యవస్థగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. ఫీల్డ్ ఆఫీసర్ల స్థాయిలో వారికి ఒత్తిడి లేకుండా ఉండేందుకు రాష్ట్రాల మధ్య వేగంగా కమ్యునికేషన్ జరిగేలా ఈ పోర్టల్ తోడ్పడుతుందన్నారు. అలాగే ఓవరాల్ కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి వారిలోనూ ఇది సహాయకారిగా ఉంటుందన్నారు. ఈ పోర్టల్‌పై ఆయా రాష్ట్రాలు వ్యక్తుల డేటా ఫైళ్లను అప్‌లోడ్ చేసుకోవచ్చారు. అనేక రాష్ట్రాలు ఇప్పటికే మైగ్రెంట్ డేటాను సేకరించినట్టు ఆయన చెప్పారు.
కాగా అలాగే దేశంలోని అన్ని జిల్లాల నుంచి శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వేశాఖ తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికక్కడ వలస కార్మికుల జాబితాను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.
Read More:
భార్య స్పైసీ వంట చెయ్యలేదని బాల్కనీ నుంచి దూకబోయిన భర్త..