ఎన్నారైలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు…

లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఎన్నారైలు(ఓవర్సీస్ సిటిజన్స్ అఫ్ ఇండియా కార్డుదారులకు) కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారు భారత్‌కు వచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే పలు ఆంక్షలను విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపధ్యంలో మార్చి 7న వీసాలపై విధించిన నిషేదాన్ని కేంద్రం సడలించింది. విదేశాల్లో ఉన్న భారతీయులకు జన్మించి.. ఓసీఐ కార్డు ఉన్నవారు భారత్ రావచ్చు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినా, లేక ఇతర అత్యవసర పరిస్థితుల్లో […]

ఎన్నారైలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు...

Updated on: May 22, 2020 | 6:19 PM

లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఎన్నారైలు(ఓవర్సీస్ సిటిజన్స్ అఫ్ ఇండియా కార్డుదారులకు) కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారు భారత్‌కు వచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే పలు ఆంక్షలను విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపధ్యంలో మార్చి 7న వీసాలపై విధించిన నిషేదాన్ని కేంద్రం సడలించింది.

విదేశాల్లో ఉన్న భారతీయులకు జన్మించి.. ఓసీఐ కార్డు ఉన్నవారు భారత్ రావచ్చు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినా, లేక ఇతర అత్యవసర పరిస్థితుల్లో గానీ ఇండియా రావాలనుకున్న వారు ఓసీఐ కార్డు ద్వారా ప్రయాణించవచ్చు. అటు విదేశీ యూనివర్సిటీలలో చదువుకుంటూ ఓసీఐ కార్డు కలిగిన విద్యార్ధులు కూడా భారత్ రావచ్చు. అయితే వారి తల్లిందండ్రులు ఇండియాలో నివసిస్తుండాలి.

Read More:

కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..

తెలుగు రాష్ట్రాలలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు.. ఎక్కడంటే..

తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల..