Corona Vaccination: కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఉత్తమం అని అటు అధికారులు.. ఇటు వైద్యులు చెబుతున్నారు. ఐతే వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయోమోనని చాలా మంది ఇప్పటికీ వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. అపోహలను నమ్మోద్దని డాక్టర్లు సూచిస్తున్నా.. కొందరిలో భయాలు పోవడం లేదు. పట్టణ ప్రాంత ప్రజలు టీకా వేసుకోవడానికి ముందుకు వస్తున్నా.. గ్రామీణ్ ప్రాంతాల్లోని ప్రజలు ముందుకు రావడం లేదు.
ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రకియను వేగవంతం చేసేందుకు బహుమతులు ప్రకటించారు అధికారులు. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా అత్తిపట్టు పంచాయతీ పరిధిలో అందించారు బహుమతులు. అత్తిపట్టులో కరోనా టీకా తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు విన్నూతంగా వ్యాక్సిన్ వేసుకున్నావారికీ స్టీల్ బిందెలు ఇస్తామని ప్రకటించారు. అత్తిపట్టు గ్రామంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ రెండవ విడత మెగా డ్రైవ్ నిర్వహించారు.
మొత్తంగా అత్తిపట్టు గ్రామంలోని పదిహేను వందల మందికీ వ్యాక్సిన్ ఇచ్చారు, వాళ్లందరీకి 700 రూపాయాల విలువైన స్టీల్ బిందెలను గిఫ్ట్స్ గా అందించారు. స్టీల్ బిందెలను గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు సుగంధి వడివేల్ స్పాన్సర్ చేశారు. అలాగే.. తిరువళ్లూర్ మున్సిపాలిటీ పరిధిలో సైతం టీకాలు వేసుకున్నా వారికి లాటరీ ద్వారా ఎంపిక చేసిన 10 మందికి సెల్‌ఫోన్స్ బహుమతులుగా అందజేశారు. వ్యాక్సిన్ వేసుకుని, గిప్ట్ తీసుకుని మురిసిపోతున్నారు స్థానికులు.