Black Fungus: భయపెడుతోన్న బ్లాక్ ఫంగ‌స్.. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 5,500 కేసులు.. 126 మరణాలు !

|

May 21, 2021 | 11:45 AM

దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ ఎటువంటి డ్యామేజ్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రోజూ వేల‌మంది మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌నువు చాలిస్తున్నారు.

Black Fungus:  భయపెడుతోన్న బ్లాక్ ఫంగ‌స్.. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 5,500 కేసులు.. 126 మరణాలు !
Black Fungus
Follow us on

దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ ఎటువంటి డ్యామేజ్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రోజూ వేల‌మంది మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌నువు చాలిస్తున్నారు. ఎంతోమంది పిల్ల‌లు త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లుగా మిగిలిపోతున్నారు. అయితే ఓవైపు కరోనాతో అల్లాడుతుంటే.. మ‌రోవైపు బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌), వైట్ ఫంగ‌స్ కేసులు గుబులు రేపుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 5,500 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ వ్యాధి వ‌ల్ల‌ 126 మంది చనిపోయినట్లు స‌మాచారం అందుతుంది. ఇక కరోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తున్న‌.. మహారాష్ట్రలోనే ఈ ఫంగస్‌ కేసులు కూడా అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 90 మంది బ్లాక్ ఫంగ‌స్ కార‌ణంగా చ‌నిపోయార‌ట‌. ఆ తర్వాత హర్యానాలో 14 మంది, యూపీలో 8 మంది, ఝార్ఖండ్‌లో నలుగురు, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చొప్పున బ్లాక్‌ ఫంగస్‌తో ప్రాణాలు విడిచారు. కొన్ని రాష్ట్రాలు ఈ ఫంగస్‌ కేసులు, మరణాలను పూర్తి స్థాయిలో లెక్కించ‌క‌పోవ‌డంతో.. లెక్క‌ల విష‌యంలో మ‌రింత స్ప‌ష్ట‌త లేద‌ని నేష‌న‌ల్ మీడియా చెబుతుంది .

మరోవైపు బ్లాక్‌ఫంగస్ తీవ్ర‌త పెరుగుతున్న క్ర‌మంలో ఆయా రాష్ట్రాలు దీన్ని అంటువ్యాధిగా ప్రకటించాలని, బాధితుల‌కు అత్యవసర చికిత్స అందించాలని కేంద్రం నిన్న ఆదేశాలు జారీ చేసింది. అటు కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధిని అదుపు చేసేందుకు ఉపయోగించే లిపోసోమల్‌ యాంపొటెరిసిన్‌ బి ఇంజెక్షన్ బ‌య‌ట మార్కెట్ లో దొర‌క‌డం లేదు. ఈ స‌మ‌స్య‌పై కేంద్రం ఫోక‌స్ పెట్టింది. ఈ మందుల కొరతను అధిగమించేందుకు మరో 5 కంపెనీలకు అనుమతులిచ్చినట్లు తెలిపింది.

Also Read: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

కృష్ణా జిల్లా పెడనలో విషాదం.. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య