BLACK FUNGUS: బ్లాక్ ఫంగస్‌కు కారణం స్టెరాయిడ్స్, డయాబెటీస్ కాదట.. ఇంకేదో వుందంటున్న ఇండోర్ ప్రొఫెసర్

|

May 24, 2021 | 3:48 PM

బ్లాక్ ఫంగస్.. ఇపుడిది కరోనా వైరస్ అనే పదం కంటే డేంజరస్‌గా కనిపిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తుంటే.. కోలుకుంటున్న వారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎక్కువవుతున్నాయి.

BLACK FUNGUS: బ్లాక్ ఫంగస్‌కు కారణం స్టెరాయిడ్స్, డయాబెటీస్ కాదట.. ఇంకేదో వుందంటున్న ఇండోర్ ప్రొఫెసర్
Follow us on

BLACK FUNGUS INFECTION NOT BECAUSE OF STEROIDS: బ్లాక్ ఫంగస్.. ఇపుడిది కరోనా వైరస్ (CORONA VIRUS) అనే పదం కంటే డేంజరస్‌గా కనిపిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) దేశాన్ని కుదిపేస్తుంటే.. కోలుకుంటున్న వారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎక్కువవుతున్నాయి. తద్వారా కోలుకుంటున్నట్లు కనిపిస్తూనే సడన్‌గా సీరియస్ అయి.. పలువురు మృత్యువాత పడుతున్నారు. తొలుత బ్లాక్ ఫంగస్ కేసులు దేశంలో కొన్ని ప్రాంతాలలోనే కనిపించినా.. తాజాగా ఈ కేసులు దేశంలో నలుమూలలా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ (TELANGANA)లో కాస్త ఎక్కువగా బ్లాక్ ఫంగస్ కేసులు కనిపిస్తుండగా.. ఏపీ (AP) లో మాత్రం బ్లాక్ ఫంగస్ కేసులు తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి.

బ్లాక్ ఫంగస్ శరీరంలో ప్రవేశించడానికి కరోనా బాధితులకు అత్యధిక మోతాదులో ఇస్తున్న స్టెరాయిడ్సే కారణమని గత వారం, పది రోజులుగా అందరు భావిస్తున్నారు. ఈ మేరకు కొందరు వైద్య నిపుణులు కూడా అభిప్రాయాలు వెల్లడించారు. రెమ్‌డెసివిర్ (REMEDISIVIR) ఇంజెక్షన్లతోపాటు బాధితులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్లనే శరీరంలో కరోనా వైరస్ అంతరించిపోయినా.. బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతుందని.. తద్వారా కరోనా బాధితులు కోలుకుంటున్నట్లు కనిపిస్తూనే సడన్‌గా చనిపోతున్నారని పలువురు వెల్లడించారు. కానీ తాజాగా ఇందుకు పూర్తిగా భిన్నమైన కథనాలు వస్తున్నాయి.

కరోనా బాధితుల్లో బ్లాక్ ఫంగస్ పెరగడానికి అడ్డుఅదుపు లేకుండా స్టెరాయిడ్స్ ఎక్కించడమే కారణమని ఓ వైపు కొందరు వైద్య నిపుణులు అభిప్రాయపడుతుంటే.. మధ్యప్రదేశ్‌ (MADHYA PRADESH)కు చెందిన ఓ ప్రొఫెసర్ మాత్రం స్టెరాయిడ్స్ కారణం కాకపోవచ్చని.. ఇతరత్రా కారణాలుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇండోర్‌ (INDORE)లోని మహాత్మాగంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ (MAHATMA GANDHI MEMORIAL MEDICAL COLLEGE)లో మెడిసిన్ డిపార్ట్‌మెంటు హెడ్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ వీపీ పాండే (PROF VP PANDE) 210 మంది బ్లాక్ ఫంగస్ రోగులపై అధ్యయనం చేశారు. పాండే అధ్యయనానికి సంబంధించిన వివరాలను డాక్టర్ రాజీవ్ జయదేవన్ (DOCTOR RAJEEV JAYADEVAN) అనే వైద్యుడు ట్విట్టర్‌ (TWITTER)లో వుంచారు.

పాండే అధ్యయనం ప్రకారం బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో 14 శాతం మంది స్టెరాయిడ్స్ ఉపయోగించనే లేదు.. అయినా వారికి బ్లాక్ ఫంగస్ సోకింది. 21 శాతం మందికి డయాబెటిస్ (DIABETISE) లేదు.. అయినా వారికి బ్లాక్ ఫంగస్ సోకింది. 36 శాతం మంది హోం ఐసోలేషన్‌ ((HOME ISOLATION)లోనే వున్నారు… వారికీ బ్లాక్ ఫంగస్ సోకింది. 52 శాతం మంది రోగులు బయటి నుంచి ఆక్సిజన్ తీసుకున్నారు. అయితే.. ఈ అధ్యయనంలో జింక్ (ZINK) వినియోగంపై స్టడీ చేయలేదని రాజీవ్ జయదేవన్ తన ట్వీట్‌లో వివరించారు. ఈ మొత్తం శాంపిళ్ళలో కామన్ పాయింట్ మాత్రం యాంటి బయాటిక్స్ మాత్రమేనని అధ్యయనంలో తేలింది.

ప్రొఫెసర్ పాండే స్టడీ రిపోర్టును పరిశీలిస్తే.. అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లనే బ్లాక్ ఫంగస్ సోకినట్లు భావించలేమని తెలుస్తోంది. బ్లాక్ ఫంగస్ సోకడానికి స్టెరాయిడ్స్, డయాబెటిస్‌లకు మించి వేరే కారణాలున్నాయని పాండే అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది. అధిక మొత్తంలో యాంటిబయాటిక్స్ వినియోగమే బ్లాక్ ఫంగస్ రావడానికి కారణమని ప్రొఫెసర్ పాండే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అజిత్రోమైసిన్ (AZITHROMYCINE), డాక్సిసైక్లిన్ (DOXYCYCLINE), కార్బాపెనెమ్స్ (CARBAPENEMS) కారణంగానే శరీరంలో బ్లాక్ ఫంగస్ సోకుతుందని పాండే ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు రాజీవ్ జయదేవన్ పేర్కొన్నారు. అయితే.. దీనిపై మరింత లోతైన అధ్యయనం అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: ఎవర్ గివెన్ షిప్ వ్యవహారంలో కొత్త మలుపు.. తప్పంతా సూయిజ్ అథారిటీదేనంటూ ఎదురు దాడి