కరోనా కాటు: బీహార్‌లో బీజేపీ ఎమ్మెల్సీ మృతి

|

Jul 22, 2020 | 4:05 PM

భారత్‌లో కరోనా మహమ్మారి వికృత రూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకూ దేశంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంచనాలకు మించి నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్యుల నుంచి వీ వీఐపీల వరకు ఇలా ఎవ్వరినీ కరోనా వదలటం లేదు...

కరోనా కాటు: బీహార్‌లో బీజేపీ ఎమ్మెల్సీ మృతి
Follow us on

భారత్‌లో కరోనా మహమ్మారి వికృత రూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకూ దేశంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంచనాలకు మించి నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్యుల నుంచి వీ వీఐపీల వరకు ఇలా ఎవ్వరినీ కరోనా వదలటం లేదు. కోవిడ్ కోరల్లో చిక్కుకుని పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. బీహార్‌లో బీజేపీ ఎమ్మెల్సీ ఒకరు కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు.

బీహార్ బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ (69) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల వైరస్ బారినపడ్డ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు. దర్బంగా జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ కు ఈ నెల 13వ తేదీన కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని దర్బంగాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న సునీల్ కుమార్ కు కరోనా సోకడంతో మంగళవారం రాత్రి మరణించారని కొవిడ్ నోడల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ చెప్పారు. కాగా, బీహార్ రాష్ట్రంలో కరోనాతో మరణించిన మొట్టమొదటి ప్రజాప్రతినిధిగా సునీల్ కుమార్ నిలిచారు. ఎమ్మెల్సీ సునీల్ కుమార్ మృతి తీరని లోటని సీఎం నితీష్ కుమార్ తన సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు పలువురు ఎమ్మెల్సీ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.