“తబ్లీగీ జమాతే”పై విశ్వ హిందూ పరిషత్ సంచలన వ్యాఖ్యలు..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వైరస్‌ను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ విధించింది. అయితే గత మార్చి 29 వరకు ఈ వైరస్ కంట్రోల్ అవుతుందనుకున్న నేపథ్యంలో మర్కజ్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘీ జమాతే సమావేశానికి హాజరైన పలువురు వీదేశీయుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు తేలాయి. అయితే ఈ సమావేశానికి పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారంతా స్వస్థలాలకు వెల్లడం.. వారిలో […]

తబ్లీగీ జమాతేపై విశ్వ హిందూ పరిషత్ సంచలన వ్యాఖ్యలు..

Edited By:

Updated on: Apr 06, 2020 | 7:34 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వైరస్‌ను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ విధించింది. అయితే గత మార్చి 29 వరకు ఈ వైరస్ కంట్రోల్ అవుతుందనుకున్న నేపథ్యంలో మర్కజ్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘీ జమాతే సమావేశానికి హాజరైన పలువురు వీదేశీయుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు తేలాయి. అయితే ఈ సమావేశానికి పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారంతా స్వస్థలాలకు వెల్లడం.. వారిలో కూడా కొందరికి ఈ వైరస్ సోకడంతో.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సమావేశాలనికి హజరైన వారిలో ఎక్కువమందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఈ క్రమంలో ఈ సంస్థ సభ్యుల తీరుపై పలు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో ఆస్పత్రిలో వైద్య సిబ్బందిపై ఉమ్మేస్తూ అలజడి సృష్టించగా.. ఘజియాబాద్‌లో చికిత్స అందించే నర్సింగ్ స్టాఫ్ పట్ల.. అసభ్యంగా ప్రవర్తిస్తూ..ఎక్కడ పడితే అక్కడ తిరగుతూ.. ఇబ్బందులకు గురిచేశారు. ఇక పలుచోట్ల.. వైద్య చికిత్స కోసం వివరాలు ఇవ్వాలని వారి కాలనీలకు వెళ్తే.. ఏకంగా వారిపై దాడులకు దిగారు. ఈ క్రమంలో ఈ తబ్లిఘీ జమాతే సభ్యులపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్.. తబ్లిఘీ సంస్థపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ సంస్థకు తీవ్రవాదులతో సంబంధాలున్నాయంటూ.. ఈ సంస్థను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేసింది. మర్కజ్ బిల్డింగ్‌తో పాటు.. ఈ సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను గుర్తించాలని.. వెంటనే ఈ సంస్థ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రెటరీ డా. సురేంద్ర జైన్ ఆరోపించారు.