Cloth Masks: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరించడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని USలోని ప్రజారోగ్య అధికారులు హెచ్చరించారు. క్లాత్ మాస్కులు ఎవ్వరూ వాడొద్దని కచ్చితంగా N95 మాస్కులను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గల కారణాలను కూడా వారు వివరించారు. 2020లో కరోనా కేసులు కొంతకాలం తగ్గుముఖం పట్టడంతో క్లాత్ మాస్కులు వాడవచ్చని అప్పుడు సూచించారు. కానీ గత కొన్ని రోజులుగా కరోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ వేగంగా పెరుగుతుంది. క్లాత్ మాస్కులు ఈ వైరస్‌ని అడ్డుకోలేకపోతున్నాయని నిర్ధారించారు.
దీనిపై తులేన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని మైక్రోబయాలజిస్ట్ చాడ్ రాయ్ ఈ విధంగా చెప్పారు. గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ని క్లాత్ మాస్కులు, సర్జికల్ మాస్కులు అడ్డుకోలేవని తెలిపారు. అయినప్పటికీ వైరస్ నుంచి రక్షింపబడుతున్నారనే ఉద్దేశ్యంతో క్లాత్ మాస్కులు ధరిస్తే ఆరోగ్యం పరంగా చాలా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్లాత్ మాస్కులను అవైడ్ చేసి N95 మాస్కులను వాడాలని ఆయన సూచించారు.
2015 కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ఆస్ట్రేలియా, వియత్నాం, చైనా శాస్త్రవేత్తలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణగా క్లాత్ మాస్కులు ఉపయోగించారు. తర్వాత ఇవి ఇన్‌ఫెక్షన్‌ని గణనీయంగా పెంచాయని తెలుసుకున్నారు. ఇప్పుఉన్న పరిస్థితులలో N95 మీకు ద్వి దిశాత్మక పద్ధతిలో రక్షణను ఇస్తుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఫార్మసీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా 400 మిలియన్ల ఉచిత N95 మాస్కులను పంపిణీ చేయాలన్నారు.