Mekapati Goutham Reddy: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పేద, ధనిక తేడా లేకుండా కరోనా ప్రతీ ఒక్కరికీ సోకుతోంది. రాకాసి వైరస్ రోజుకొక రూపాంతరం చెందుతూ ప్రతి ఒక్కరిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి అంటుకుంటోంది. ప్రోటోకాల్ ఉండే కీలక నేతలను, సెలబ్రటీలను సైతం వైరస్ వదిలి పెట్టడం లేదు. ప్రస్తుతం ఐదుగురు సీఎంలకు కరోనా పాజిటివ్ రాగా వారు ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అటు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాకాసి కోరల్లో చిక్కుకుంటున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన స్వయంగా ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారరణ అయ్యినట్లు పేర్కొన్నారు. కొద్దిపాటి జ్వరంగా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో మంత్రి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గత రెండు మూడురోజుల్లో వ్యక్తిగతంగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని గౌతమ్‌రెడ్డి సూచించారు. మంత్రికి కరోనా సోకడంతో ఇవాళ మైక్రోసాఫ్ట్ సంస్థతో జరగాల్సిన కీలక ఒప్పంద కార్యక్రమం వాయిదా పడింది.
I have shown mild symptoms & upon testing, my report came as COVID positive. I am taking required treatment & currently in isolation.
Those, who have met me in last one week, pls follow covid protocols, get tested & pls take care.@YSRCParty @AndhraPradeshCM @PTI_News
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) April 23, 2021
Read Also… AP High Court : ఏపీ ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్