బ్రేకింగ్: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

| Edited By:

Jul 06, 2020 | 11:31 AM

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. గతంలోనే ఒకసారి వాయిదా పడి.. జులై 8వ తేదీన ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోనూ ఎల్లుండి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కావడంతో ఆ రోజే ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని..

బ్రేకింగ్: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా
Follow us on

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. గతంలోనే ఒకసారి వాయిదా పడి.. జులై 8వ తేదీన ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోనూ ఎల్లుండి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కావడంతో ఆ రోజే ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని భారీ ఏర్పాట్లను కూడా చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.

జులై 8న అన్ని జిల్లాల్లో ఒకేసారి 30 లక్షల మందికి పైగా పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఇప్పుడు ఆగష్టు 15న ఇవ్వాలని భావిస్తోంది ఏపీ సర్కార్. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో ప్రజలంతా ఒకే సారి గుంపుగా చేరే అవకాశం ఉంది. దీంతో కరోనా విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉన్న కారణంగా మరోసారి ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది ఏపీ సర్కార్.

కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం 998 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఒక్క రోజే 14 మంది మృతి చెందారు. కోవిడ్ వల్ల కర్నూలులో 5, అనంతపూర్‌లో 3, చిత్తూరులో 2, కడపలో 2, కృష్ణలో ఒకరు, విశాఖ పట్నంలో ఒకరు మరణించారు. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 18,697కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 232 మంది మృతి చెందారు. ఇందులో 10,043 యాక్టివ్ కేసులు ఉండగా, ఇక 8,422 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Read More: 

గోల్డ్ కొనాలనుకునే వారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..