ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌

ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల విష‌యంలో ప‌లు కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. తాజాగా హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి వ‌చ్చి స‌చివాల‌య, అసెంబ్లీ, శాఖాధిపతుల కార్యాల‌యాల్లో.. విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఉచిత వ‌సతి క‌ల్పిస్తున్న..

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 26, 2020 | 8:02 AM

ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల విష‌యంలో ప‌లు కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ తీవ్రంగా విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో ఉద్యోగులు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశ్యంతోనే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి వ‌చ్చి స‌చివాల‌య, అసెంబ్లీ, శాఖాధిపతుల కార్యాల‌యాల్లో.. విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఉచిత వ‌సతి క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఫ్రీ వ‌స‌తి సౌక‌ర్యాన్ని మ‌రో ఏడాది పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం. దీంతో మొత్తం 750 ఉద్యోగులు ల‌ద్ధిపొందుతున్నారు. ఇందులో రెగ్యుల‌ర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఆగష్టు 1వ తేదీ నుంచి.. జులై 31, 2021 వ‌ర‌కూ ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి సౌక‌ర్యాన్ని పెంచుతూ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌భుత్వ ఈ తాజా నిర్ణ‌యంతో ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Read More:

బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?

కరోనా వైరస్‌తో ఆర్మీ జవాను మృతి

సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్‌ క్లాసులు

కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య

వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం