Andhra Pardesh Corona Updates: ఏపీలో కరోనా(AP Corona Cases)కేసులు రోజు రోజుకు తగ్గుతున్నా.. మరణాలు మాత్రం ఇవాళ పెరిగాయి. జనవరి మొదటి వారంలో పెరిగిన కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా దిగివస్తోంది. అయితే కోవిడ్ కేసుల సంఖ్య కొద్దిగా తెగ్గినప్పటికీ.. జాగ్రత్తలు మాత్రం మరిచిపోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 46,929 శాంపిల్స్ ని పరీక్షించగా 13,819 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,06,060కి చేరింది. కొత్తగా కోవిడ్ (Covid – 19) కారణంగా చిత్తూరు, తూర్పు గోదావరి , కర్నూలు, నెల్లూరుతోపాటు విశాఖపట్నంలో ఇద్దరిని కబలించగా.. ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు వదిలారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14561కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 101396 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు దిగువ పట్టికలో చూడండి..
#COVIDUpdates: 25/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,06,060 పాజిటివ్ కేసు లకు గాను
*20,90,103 మంది డిశ్చార్జ్ కాగా
*14,561 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,01,396#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/AVGC26uidQ— ArogyaAndhra (@ArogyaAndhra) January 25, 2022
కొత్తగా 24 గంటల వ్యవధిలో 5716 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2090103కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,2234226 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా విశాఖ జిల్లాలో ప్రమాదకరంగా 1988 కొత్త కేసులు నమోదు కాగా.. ప్రకాశం లో 1589 కేసులు రావడంతో ఆందోళనగా మారింది, అయితే ఆ తర్వాత స్థానంలో గుంటూరు,నెల్లూరు, గోదావరి జిల్లాలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి .
ఇవి కూడా చదవండి: Telangana Corona: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్..
UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జలాల్‌పూర్ ఎమ్మెల్యే..