AP Corona Cases: ఏపీలో పెరిగిన కేసుల సంఖ్య.. కొత్తగా ఆ జిల్లాల్లో మాత్రం..

|

Jan 24, 2022 | 6:40 PM

తాజాగా 24 గంటల వ్యవధిలో 40,266 శాంపిల్స్ ని పరీక్షించగా 14,502 మందికి కరోనా సోకినట్లు తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,92,241కి చేరింది. కొత్తగా కోవిడ్..

AP Corona Cases: ఏపీలో పెరిగిన కేసుల సంఖ్య.. కొత్తగా ఆ జిల్లాల్లో మాత్రం..
Follow us on

Andhra Pardesh Corona Updates: ఏపీలో కరోనా(AP Corona Cases) వ్యాప్తి రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతోంది. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 40,266 శాంపిల్స్ ని పరీక్షించగా 14,502 మందికి కరోనా సోకినట్లు తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,92,241కి చేరింది. కొత్తగా కోవిడ్(Covid – 19) కారణంగా పశ్చమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు వదిలారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14549కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 93305 యాక్టివ్ కేసులున్నాయి.

కొత్తగా 24 గంటల వ్యవధిలో 4800 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2084387కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,21,87,297 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా విశాఖ జిల్లాలో ప్రమాదకరంగా 1728 కొత్త కేసులు నమోదు కాగా.. అనంతపురంలో 1610 కేసులు రావడంతో ఆందోళనగా మారింది, అయితే ఆ తర్వాత స్థానంలో కర్నూలు జిల్లా చేరింది. ఇదిలావుంటే.. గత ఎప్పుడు ముందు వరసలో ఉండే చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం 685 కేసులు వచ్చాయి.

జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు దిగువ పట్టికలో చూడండి..

ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..