ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 64,800 మందికి కరోనా పరీక్షలు చేయగా 4,872 కరోనా కేసులు వెలుగుచూశాయి. కొత్తగా మరో 86 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 13,702 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,14,510 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కొత్తగా కరోనాతో చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 మంది మృతి చెందారు. శ్రీకాకుళంలో 9; విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడుగురు చొప్పున ప్రాణాలు విడిచారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 961 కేసులు వెలుగుచూశాయి. తూ.గో. జిల్లాలో 810, అనంతపురం జిల్లాలో 535, ప్రకాశం జిల్లాలో 447 కరోనా కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 07/06/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,60,316 పాజిటివ్ కేసు లకు గాను
*16,34,254 మంది డిశ్చార్జ్ కాగా
*11,552 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,14,510#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/KCpTMDnUL8— ArogyaAndhra (@ArogyaAndhra) June 7, 2021
చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3 కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖ, తిరుపతితో పాటు విజయవాడ-గుంటూరు ఒకచోట వాటిని రెడీ చేయాలని సూచించారు. కొవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కరోనా థర్డ్‌వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో జగన్ సమగ్రంగా చర్చించారు. థర్డ్‌వేవ్‌పై అనాలసిస్, డేటాలను అధికారులు ఆయనకు వివరించారు. చిన్నారుల కోసం ఏర్పాటు ఒక్కో కేర్ సెంటర్ నిర్మాణానికి రూ.180కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. థర్డ్‌వేవ్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని.. పోషకాహార పంపిణీ, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాలలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు