Andhra Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 14,429 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా

|

May 28, 2021 | 5:06 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతుంది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 84,502కరోనా పరీక్షలు చేయ‌గా 14,429 కరోనా కేసులు....

Andhra Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 14,429 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా
Ap Corona
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతుంది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 84,502కరోనా పరీక్షలు చేయ‌గా 14,429 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 103 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 20,746మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,80,362 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో చిత్తూరు, ప.గో. జిల్లాల్లో  అత్యధికంగా  15 మంది చొప్పున మృతి చెందారు. విశాఖ జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 9 మంది అనంతపురం, కృష్ణా, తూ.గో. జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. గుంటూరు, విజ‌యనగ‌రం జిల్లాల్లో ఏడుగురు చొప్పున‌.. శ్రీకాకుళంలో ఆరుగురు, క‌డప, క‌ర్నూలులో న‌లుగురు చొప్పున‌, ప్ర‌కాశంలో ఇద్ద‌రు మ‌హ‌మ్మారి కార‌ణంగా క‌న్నుమూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.90 కోట్లకు పైగా శాంపిల్స్‌ పరీక్షించగా.. 16,57,986 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరిలో 14,66,990మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 10,634మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు..

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఏపీ స‌ర్కార్ చర్యలు తీసుకుంది. 50 లేదా అంతకు మించి బెడ్స్ ఉన్న‌ ఆస్పత్రులు తప్పని సరిగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ప్ర‌భుత్వం ఆదేశించింది. 50 నుంచి 100 బెడ్స్ ఉన్న‌ ప్రైవేటు ఆస్పత్రులు 500 ఎల్‌పీఎమ్‌ కెపాసిటీ ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 100కు పైగా పడకలున్న ప్రైవేటు ఆస్పత్రులు 1000 ఎల్‌పీఎమ్‌ కెపాసిటీ కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రతి ప‌డ‌క‌కు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు తప్పకుండా ఉండాలని గ‌వ‌ర్న‌మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది. 50 బెడ్ల కంటే తక్కువ ప‌డ‌క‌లు ఉన్న ఆస్పత్రులు కూడా ప్రతి బెడ్‌కూ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:  ఏపీలో మ‌రో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు స‌ర్కార్ ఉత్త‌ర్వులు !

ఏపీలో టెన్త్ పరీక్ష‌లు క‌చ్చితంగా నిర్వ‌హిస్తాం.. వ‌దంతుల‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి క్లారిటీ