AP Corona Cases: ఏపీలో కొత్త‌గా 22,517 క‌రోనా పాజిటివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగా మ‌ర‌ణాలు

|

May 15, 2021 | 7:15 PM

ఏపీలో క‌రోనా తీవ్రత కొన‌సాగుతుంది. కొత్త‌గా 89,535 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 22,517 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

AP Corona Cases: ఏపీలో కొత్త‌గా 22,517 క‌రోనా పాజిటివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగా మ‌ర‌ణాలు
Ap Corona
Follow us on

ఏపీలో క‌రోనా తీవ్రత కొన‌సాగుతుంది. కొత్త‌గా 89,535 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 22,517 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 14,11,320 మంది వైరస్‌ బారినపడ్డారు. కరోనా కార‌ణంగా కొత్త‌గా.. అనంతపురంలో 12 మంది చ‌నిపోగా, నెల్లూరులో 11, తూర్పుగోదావరి 10, విశాఖ 9, విజయనగరం 9, చిత్తూరు 8, శ్రీకాకుళం 8, గుంటూరు 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, కర్నూలు 5, ప్రకాశం 5, కడప ఇద్దరు ప్రాణాలు విడిచారు. తాజాగా 18,739 మంది వైర‌స్ బారి నుంచి కోలుకోగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 11,94,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో తూర్పుగోదావరిలో అత్య‌ధికంగా 3383 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 992 కేసులు వెలుగుచూశాయి. మొత్తం 1,78,80,755 శాంపిల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కాగా క‌రోనా కొత్త వేరియంట్లపై ఎన్నో అనుమానాలు నెల‌కుంటున్నాయి. వీటిని వ్యాక్సిన్లు ఏమేర ఎదుర్కొంటాయన్న దానిపై ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక సూచన చేశారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని సూచించారు. అలాగే భౌతిక దూరం సైతం పాటించాలన్నారు. వైరస్‌ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అలెర్ట్ గా ఉండాల‌న్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌ని చెప్పారు. అయితే, ఏ వేరియంట్‌ బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.

Also Read:  బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ఈఎన్‌టీ ఆస్పత్రి.. తెలంగాణ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

 క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను..