Tammineni seetharam corona : కరోనా వైరస్ బారిన పడిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు సహా ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. చికిత్స అనంతరం దంపతులిద్దరూ సంపూర్ణంగా కోలుకున్నారు. క్రిటికల్ ట్రీట్‌మెంట్ అందించిన వైద్యులకు స్పీకర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేశారు. కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతులుగా ఈరోజు మెడికవర్ ఆస్పత్రి నుంచి తమ్మినేని ఫ్యామిలి డిశ్చార్జ్ అయ్యారు. శ్రీకాకుళం నుండి ఇంటికి వెళ్తూ ఆసుపత్రి యాజమాన్యానికి, డాక్టర్లకు, సిబ్బందికి, పేరు పేరునా తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబసభ్యులు వినమ్రంగా నమస్కారాలు తెలియజేశారు. కరోనా రోగులకు జిల్లాలో అందిస్తున్న వైద్యంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్‌గా తనకు ఎటువంటి వైద్యం అందించారో.. ఆరోగ్య శ్రీ లబ్దిదారునికి కూడా ఇదే తరహా వైద్యం అందించడాన్ని తమ్మినేని అభినందించారు. కరోనా కష్టకాలంలో రాజకీయ లబ్ది కోసం మాట్లాడటం సరికాదని తమ్మినేని అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ప్రజలకు భరోసా ఇవ్వాలికానీ.. భయాందోళనలు కలిగించడం మానుకోవాలని ఆయన సూచించారు. కాగా, తమ్మినేని సీతారాం కంటే ముందు.. ఆయన సతీమణి వాణీశ్రీకి వైరస్ సోకటంతో.. ఇదే ఆసుపత్రిలో దంపతులిద్దరూ చికిత్స పొందారు. జిల్లా ఉన్నతాధికారులు సభాపతి దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పడు ఆరా తీసి చర్యలు తీసుకున్నారు.
Read also : Black fungus : బ్లాక్ ఫంగస్ ముప్పుపై ముందే మేల్కొన్న భారత్.. మార్కెట్లో డ్రగ్ కొరత ఏర్పడకుండా ముమ్మర చర్యలు