లాక్ డౌన్ మా ఇద్దరిని మరింత కలిపింది -అనుష్కశర్మ

అనుష్క శర్మ తమ వైవాహిక జీవితంకు సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టింది. తమ వివాహం జరిగిన తర్వాత తొలి ఆరు నెలల్లో 21 రోజులు మాత్రమే కలిసి గడిపామని చెప్పింది. తాజాగా `వోగ్` మేగజీన్ కవర్ పేజీ‌పై మెరిసిన అనుష్క శర్మ.. ఆ పత్రికకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా చాలా విషయాలు అనుష్క బయటపెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఈ వివరాలను వెల్లడించింది. మా […]

  • Sanjay Kasula
  • Publish Date - 2:35 am, Thu, 2 July 20
లాక్ డౌన్ మా ఇద్దరిని మరింత కలిపింది -అనుష్కశర్మ
विराट 3

అనుష్క శర్మ తమ వైవాహిక జీవితంకు సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టింది. తమ వివాహం జరిగిన తర్వాత తొలి ఆరు నెలల్లో 21 రోజులు మాత్రమే కలిసి గడిపామని చెప్పింది. తాజాగా `వోగ్` మేగజీన్ కవర్ పేజీ‌పై మెరిసిన అనుష్క శర్మ.. ఆ పత్రికకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా చాలా విషయాలు అనుష్క బయటపెట్టారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఈ వివరాలను వెల్లడించింది. మా ఇద్దరిలో ఎవరో ఒకరం వర్క్‌తో బిజీగా ఉండేవారమని.. తెలిపింది. ఆ సమయంలో విరాట్ ను కలిసేందుకు రోజులు లెక్క పెట్టేదాన్ని అని గుర్తు చేసుకున్నారు. నేను అతణ్ని కలిసేందుకు విదేశాలకు వెళ్లినపుడు భోజనం కోసం బయటకు వెళ్లేవాళ్లం. అప్పుడే కాసేపు విరాట్ తో సరదాగా గడిపే ఛాన్స్ దొరికేదని వెల్లడించారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇద్దరం ఒకే చోట కలిసి ఉండే అవకాశం దక్కిందని అన్నారు.