AP Covid 19: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..?

|

Sep 28, 2021 | 8:02 PM

Andhra Pradesh Coronavirus: కరోనా మహమ్మారి ప్రభావం మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకాలం విరుచుకుపడ్డ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

AP Covid 19: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..?
Coronavirus
Follow us on

AP Coronavirus Positive Cases Today: కరోనా మహమ్మారి ప్రభావం మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకాలం విరుచుకుపడ్డ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,592 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 771 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,48,230 కు చేరింది. ఇక, గత 24 గంటలలో కరోనా బారిన పడి మరో 8 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 14,150 కు చేరింది.

కాగా, గత 24 గంటల్లో 1,333 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 19,89,391 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 11,912 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరోవైపు,ఏపీలో ఇప్పటి వరకు 2,81,78,305 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక, వివిధ జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…

Ap Corona

Read Also… IPL 2021, KKR vs DC Match Result: కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయం.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘోర పరాజయం