AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో 200పైగా కేసులు నమోదు..!

|

Aug 28, 2021 | 5:57 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 200పైగా కేసులు నమోదయ్యాయి.

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో 200పైగా కేసులు నమోదు..!
Ts Corona
Follow us on

AP Covid 19 Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 200పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, మిగిలిన ప్రాంతాల్లో వందలోపు పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కాగా, గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 64,865 నమూనాలను పరీక్షించగా, 1,321 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 20,10,566కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 19,81,906 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగా, గడచిన 24 గంటల్లో 1,499 మంది కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,853గా ఉంది. ఇక, ఏపీలో గత 24గంటల్లో 19 మంది కరోనా రాకాసి కోరలకు చిక్కుకుని ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఏపీ వ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 13,807కి చేరింది. మరోవైపు, ఇప్పటివరకు రాష్ట్రంలో 2,64,71,272 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 12, చిత్తూరు జిల్లాలో 225, తూర్పుగోదావరి జిల్లాలో 218, గుంటూరు జిల్లాలో 128, కడప జిల్లాలో 67, కృష్ణాజిల్లాలో 153, కర్నూలు జిల్లాలో 16, నెల్లూరు జిల్లాలో 139, ప్రకాశం జిల్లాలో 118, శ్రీకాకుళం జిల్లాలో 30, విశాఖపట్నం జిల్లాలో 42, విజయనగరం జిల్లాలో 42, పశ్చిమగోదావరి జిల్లాలో 142 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.

Read Also… 

Police Gun Fire: అన్నదమ్ముల్లా కలసి ఉండాల్సిన గ్రామాల మధ్య ‘స్ప్రింగ్ వల’ చిచ్చు.. పోలీసుల కాల్పులు.. పలువురికి గాయాలు!

టిక్ టాక్ వీడియోలు చేసేందు ఫోన్‌‌న్ని దొంగలించిన చిలుక.. తప్పక చూడవలసిన వీడియో