ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 1178 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 21,197కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 1155 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 22 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రంలో 13 కరోనా మరణాలు సంభవించాయి. కర్నూల్ జిల్లాలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్టణంలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 252కి చేరింది. అలాగే 11,200 యాక్టివ్ కేసులు ఉండగా.. 9,745 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 24 గంటల్లో 16,238 పరీక్షలు నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య 10,50,090కు చేరింది.
#COVIDUpdates: 07/07/2020, 10:00 AM వరకురాష్ట్రం లోని నమోదైన ఇతర రాష్ట్ర & ఇతర దేశాలకు చెందిన పాజిటివ్ కేసుల వివరాలు #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/iHliXVAopw
— ArogyaAndhra (@ArogyaAndhra) July 7, 2020