AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

|

May 30, 2021 | 6:13 PM

AP Corona Updates: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా...

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..
Ap Coronavirus
Follow us on

AP Corona Updates: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 84,232 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా.. వారిలో 13,400 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. ఇక 21,133 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 94 మంది ప్రాణాలు కోల్పాయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,91,72,843 శాంపిల్స్ పరీక్షించగా 16,85,142 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 15,08,515 మంది కరోనాను జయించి పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో 10,832 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,65,795 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 1,215 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరులో – 1,971, తూర్పు గోదావరి – 2,598, గుంటూరు – 848, కడప – 701, కృష్ణా – 858, కర్నూలు – 712, నెల్లూరు – 652, ప్రకాశం – 838, శ్రీకాకుళం – 623, విశాఖపట్నం – 1054, విజయనగరం – 362, పశ్చిమ గోదావరి – 968 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read:

Raghu Rama krishna Raju: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ.. వీల్ చైర్‌లోనే..