Covid-19 second Wave advances: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి అమలు చేస్తున్నారు. దీంతో వేతన జీవులు మళ్లీ ఆర్ఠిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ వేతన జీవులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది. నెలసరి వేతనం రూ.15 వేల లోపు ఉన్న ఈపీఎఫ్ సభ్యులకు కరోనా మహమ్మారి వేళ కోవిడ్-19 అడ్వాన్స్ చేదుడువాదోడుగా ఉంటుంది. అయితే.. కరోనా సెకండ్ వేవ్‌తోపాటు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న తరుణంలో తమ సభ్యులు తొలిదఫా కోవిడ్-19 అడ్వాన్స్ మాదిరిగానే రెండో దఫా అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర కార్మికశాఖ సోమవారం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ లో ఖాతాదారులకు అండగా ఉండేందుకు రెండోసారి నాన్ రిఫండబుల్ కొవిడ్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఈ ప్రత్యేక నిబంధనను గతేడాది మార్చిలో ప్రకటించామని అని కార్మికశాఖ ప్రకటించింది. అయితే.. ఫస్ట్ అడ్వాన్స్ మాదిరిగానే ఇప్పుడు కూడా విత్‌డ్రా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు కోవిడ్-19 అడ్వాన్స్ కోసం 76.31 లక్షల క్లెయిమ్‌లకు పైగా ఆమోదించినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. దీని కింద రూ.18,698.15 కోట్లు పంపిణీ చేసినట్లు ప్రకటించింది. కోవిడ్ అనంతరం ఈపీఎఫ్‌వో ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ పేరిట ఒక వ్యవస్థను రూపొందించింది. సభ్యులు కేవైసీ సమర్పించిన తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలు జారీ చేసింది. మామూలుగా అయితే ఈ క్లెయిమ్‌లను ఆమోదించడానికి 20 రోజులు పడుతుంది.
Also Read: