AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను జయించిన కిడ్నీ పేషెంట్‌..వైద్యం అందక అవస్థలు!

యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కరోనా బారినపడి కోలుకున్న ఓ కిడ్నీ పేషెంట్‌ను కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలోని తుర్కపల్లి మండలం..

కరోనాను జయించిన కిడ్నీ పేషెంట్‌..వైద్యం అందక అవస్థలు!
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2020 | 4:33 PM

Share

యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కరోనా బారినపడి కోలుకున్న ఓ కిడ్నీ పేషెంట్‌ను కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలోని తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన వ్యక్తి ఏడేళ్ల క్రితం కిడ్నీలు చెడిపోవడంతో..అప్పట్నుంచి ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు.

ఇదే క్రమంలో డయాలిసిస్ చేయించుకోవడానికి వెళ్లగా.. అదే ఆస్పత్రికి వచ్చిన మరో కిడ్నీపేషెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ రోజు డయాలిసిస్ చేయించుకున్న వారందరికీ కరోనా టెస్టులు చేయగా..ఇతడికి కూడా కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన అతడు 16 రోజుల చికిత్స అనంతరం కోలుకొని ఇంటికి వెళ్లాడు.

తిరిగి మళ్లీ డయాలసిస్ చేయించుకోవడం కోసం తాను గతంలో వెళ్లిన ఆస్పత్రికి వెళ్లగా..ఇప్పుడు డయాలసిస్ చేయడం కుదరదు.. మరో ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. వేరే ఆస్పత్రికి వెళితే..అక్కడా కుదరదని చెప్పారు. చివరకు దగ్గర్లోని ఆలేరు ఆస్పత్రికి వెళ్లగా.. కరోనా నుంచి కోలుకున్నా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. కాబట్టి క్వారంటైన్ గడువు ముగిశాక రావాలని సూచించారు. దీంతో బాధితుడు ఆందోళనకు గురవుతున్నాడు. మూడు రోజులకోసారి డయాలిసిస్ చేయించుకోవాల్సి రావడం.. మరోవైపు ఆస్పత్రులు తిప్పి పంపుతుండటంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Follow Us
పండుగ సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి శుభవార్త.
పండుగ సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి శుభవార్త.
అమ్మమ్మ కాలం నాటి పులిహోర గోంగూర పచ్చడి..
అమ్మమ్మ కాలం నాటి పులిహోర గోంగూర పచ్చడి..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తినేశాారా.. బొప్పాయి వీరికి విషం..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తినేశాారా.. బొప్పాయి వీరికి విషం..
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!