Actress Shiva Parvathi Tests Corona Positive: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అందులోనూ పలువురు సినిమా, సీరియల్ సెలబ్రిటీలు వరుస పెట్టి కరోనా బారిన పడుతూనే ఉన్నారు. మంగళవారమే ఇద్దరు టాలీవుడ్ సింగర్లు సునీత, మళవికలకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ నటి శివ పార్వతికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆవిడే వీడియోలో పేర్కొన్నారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు శివ పార్వతి. పలు తెలుగు చిత్రాలు, సీరియల్స్‌లలో నటించారు పార్వతి. కాగా ప్రస్తుతం ఈమె ‘వదినమ్మ’ సీరియల్‌లో నటిస్తున్నారు. తనకు కరోనా సోకినా ఎవరూ పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నటీనటులకు ఇన్స్యూరెన్స్ చేయిస్తున్నారనే మాట ఎంత వరకు నిజం అని ప్రశ్నించారు శివపార్వతి. ఒక వేళ తనకు అలాంటిది చేసి ఉంటే, తనకు వర్తిస్తుందా? లేదా? అని ఎందుకు పట్టించుకోలేదు? వదినమ్మ సీరియల్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ కూడా తన బాగోగులు అడగలేదని చెప్పారు. నేను ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా జీవిత రాజశేఖర్‌లు సాయం చేశారని వెల్లడించారు నటి శివ పార్వతి.
Read More:
కరోనా బారిన పడ్డ మరో తమిళనాడు మంత్రి