నేటి నుంచి రేషన్ సరుకుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలో ఇవాళ్టి నుంచి పదో విడత నిత్యావసర సరుకుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న పాత, కొత్త రేషన్ కార్డులకు బుధవారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.
Distribution of Rations From Today in AP : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలో ఇవాళ్టి నుంచి పదో విడత నిత్యావసర సరుకుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న పాత, కొత్త రేషన్ కార్డులకు బుధవారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. తెలుపు, అంత్యోదయ, అన్నయోజన, అన్నపూర్ణ కార్డుదారులకు ఒక్కో సభ్యునికి 5 కేజీల బియ్యం, కార్డుకు కేజీ శనగలు ఉచితంగా అందజేయనున్నారు. రేషను కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అరకిలో పంచదార మాత్రం రూ.17కు ఇవ్వనున్నారు. పీఎం గరీభ్ కల్యాణ్ యోజన పథకంలో భాగంగా రేషన్ ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఉచితంగా రేషన్ అందించాలని ఆదేశించింది. రేషన్ కార్డు ఉన్నవారు సమీపంలోని రేషన్ షాపులో తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్ నిబంధనలు, సూచనలను పాటిస్తూ నిత్వావసర సరుకుల పంపిణీ చేయనున్నారు.