AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాని జయించిన 97 ఏళ్ల వృద్ధుడు..

చెన్నైలో 97 ఏళ్ల వృద్ధుడు కరోనాని జయించాడు. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తరువాత కరోనా వైరస్ నుండి 97 ఏళ్ల వ్యక్తి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. మే 30వ తేదీ 97 ఏళ్ల కృష్ణ మూర్తి అనే వ్యక్తి జ్వరం, జలుబు, దగ్గుతో పాటు తేలికపాటి శ్వాస ఇబ్బందితో...

కరోనాని జయించిన 97 ఏళ్ల వృద్ధుడు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 13, 2020 | 1:34 PM

Share

చెన్నైలో 97 ఏళ్ల వృద్ధుడు కరోనాని జయించాడు. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తరువాత కరోనా వైరస్ నుండి 97 ఏళ్ల వ్యక్తి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. మే 30వ తేదీ 97 ఏళ్ల కృష్ణ మూర్తి అనే వ్యక్తి జ్వరం, జలుబు, దగ్గుతో పాటు తేలికపాటి శ్వాస ఇబ్బందితో హాస్పిటల్‌‌లో జాయిన్ అయ్యారు. అలాగే అతను గత కొన్ని సంవత్సరాలుగా హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ వంటి కొమోర్బిడ్ వ్యాధులతో కూడా బాధపడుతున్నాడని హాస్పిటల్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కృష్ణమూర్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు. కాగా శుక్రవారం కూడా 97 ఏళ్ల వయసున్న ఆగ్రా వ్యక్తి కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

కాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉంది. ఒక్క రోజులేనే 11,458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993 ఉండగా.. 1,54,330 మంది డిశ్చార్జి అయ్యారు. 8,884 మంది మరణించగా.. 1,45,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మే 19నాటికి దేశంలో లక్ష కేసులు నమోదు కాగా, జూన్‌ 3నాటికి రెట్టింపు అయ్యాయి. ఇక మరో పది రోజుల్లోనే ఆ కేసులు 3 లక్షలకు చేరడం గమనార్హం. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా రికవరీ రేటు భారత్‌లో ఎక్కువగా ఉండటం ఆనందించాల్సిన విషయం.

Follow Us
సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే..
సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే..
తవ్వకాల్లో బయటపడ్డ 80 ఏళ్ల నాటి నాజీ యుద్ధ ట్యాంక్..అది ఒక రహస్యం
తవ్వకాల్లో బయటపడ్డ 80 ఏళ్ల నాటి నాజీ యుద్ధ ట్యాంక్..అది ఒక రహస్యం
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ.. బెస్ట్ ఫీచర్స్‌తో ఇ-స్కూటర్
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ.. బెస్ట్ ఫీచర్స్‌తో ఇ-స్కూటర్
గ్యాప్ తగ్గింది, గెలుపు మాదే!.. స్మృతి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు
గ్యాప్ తగ్గింది, గెలుపు మాదే!.. స్మృతి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు
మాటలతోనే మాయ చేస్తారు.. ఈ 4 రాశుల వారిని కాదనడం చాలా కష్టం, మీ ..
మాటలతోనే మాయ చేస్తారు.. ఈ 4 రాశుల వారిని కాదనడం చాలా కష్టం, మీ ..
వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం..
వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం..
క్రియేటర్స్, వీడియో మేకర్స్ కోసం టాప్ 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే!
క్రియేటర్స్, వీడియో మేకర్స్ కోసం టాప్ 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే!
మేకులు దింపిన బొమ్మ.. పక్కనే బలి ఇచ్చిన మేక.. బాబోయ్..
మేకులు దింపిన బొమ్మ.. పక్కనే బలి ఇచ్చిన మేక.. బాబోయ్..
బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు విచారణ చేస్తుండగా...
బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు విచారణ చేస్తుండగా...
బుధుడు వక్రగతిలోకి.. ఈ 3 రాశుల వారికి 25 రోజులు కష్టకాలం, డబ్బు..
బుధుడు వక్రగతిలోకి.. ఈ 3 రాశుల వారికి 25 రోజులు కష్టకాలం, డబ్బు..