కరోనా మహమ్మారి పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర పోలీసులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 77 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ పోలీస్ కుటుంబ సభ్యులు వణికిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికిపైగా కరోనాతో ఆస్పత్రుల్లో పోరాడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి యాభై తొమ్మిది మంది సిబ్బంది మరణించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీస్ అధికారులు వెల్లడించారు.
మరోవైపు కరోనా మహమ్మారి రాష్ట్రంలో విలయ తాండవం చేస్తోంది. రోజు వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1.61లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు పెరుగుతున్న కేసులతో ప్రభుత్వం మరికొన్ని రోజులపాటు లాక్‌డౌన్ కొనసాగించనుంది. జూలై 31వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తీసుకోవాల్సిన నిబంధనలను జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులకు అప్పగించింది.
77 police personnel found positive for #COVID19 & two others died in Maharashtra in the last 24 hours, taking the total number of active cases to 1,030 and death toll to 59 in the force: Maharashtra Police pic.twitter.com/Mh9MQ3w7ad
— ANI (@ANI) June 29, 2020