Coronavirus: వైరస్ టెర్రర్.. ప్రకాశం జిల్లా పాఠశాలల్లో 76 మందికి కరోనా

|

Aug 28, 2021 | 11:40 AM

కరోనా మహమ్మారి చదువులను చక్కగా సాగనిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పాఠశాలల్లోని స్టూడెంట్స్ కరోనా బారినపడ్డారు. పలు చోట్ల ఉపాధ్యాయులకు కూడా మహమ్మారి సోకింది.

Coronavirus: వైరస్ టెర్రర్.. ప్రకాశం జిల్లా పాఠశాలల్లో 76 మందికి కరోనా
Coronavirus Spread
Follow us on

ఏపీలోని పాఠశాల్లలో కరోనా టెన్షన్ రేపుతోంది. ముఖ్యంగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  రోజురోజుకు పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అటు పేరెంట్స్‌లోనూ, ఇటు అధికారుల్లోనూ టెన్షన్ మొదలైంది. ప్రకాశం జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి(ఆగస్టు 16) నుంచి ఇప్పటివరకు 28 మంది విద్యార్థులు, 48 మంది ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవన్‌లో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నిర్వహించిన సమీక్షలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఈ విషయం వెల్లడించారు. స్కూల్స్‌లో కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పక్కాగా పాటించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కేసులు నమోదైన పాఠశాలలను విద్యాశాఖాధికారులు సందర్శించి వివరాలు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

స్కూళ్లు తెరవకపోతే.. ఓ బాధ. తెరిస్తే మరో బాధ అన్నట్లు ఉంది పరిస్థితి. బడికి పంపి నాలుగు అక్షరాలు నేర్పిద్దామనుకుంటే.. అసలు జీవితం ఉంటుందో లేదోనన్న భయం మొదలైంది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు స్కూల్స్‌ను పునః ప్రారంభించాయి. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆగష్టు 16వ తేదీ నుంచి స్కూల్స్‌ను రీ-ఓపెన్ చేసింది. అయితే అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో.. తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే పాఠశాలల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసులు గుబులు రేపుతున్నాయి.  కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విద్యార్థులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, వారందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అటు చిన్నారుల నుంచి వైరస్‌ వ్యాప్తి జరక్కుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ కరోనా మహమ్మారి మనుషులు జీవితాలను సాఫీగా పోనిచ్చేలా లేదు. ఇప్పుటికే రెండేళ్లు చదువు అటకెక్కింది. ఇలానే కొనసాగితే ఎలా..? పోని బళ్లకు పంపిద్దామంటే కరోనా భయం. ఏం చెయ్యాలో తెలియక పేరెంట్స్ అయోమయ స్థితిలో ఉన్నారు.

Also Read: నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నవ వధువు, ఆమె తండ్రి స్పాట్‌లోనే మృతి

కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద క్రేజీ సీన్… ప్రేమించి, పెళ్లాడిన యువతి కోసం సినిమా స్టైల్లో