Corona Fourth Wave: భారత్‌లో18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్‌ డోస్‌!.. సీరం సీఈవో ఏమన్నారంటే..

|

Apr 06, 2022 | 5:43 PM

Coronavirus: సుమారు రెండేళ్ల క్రితం పురుడు పోసుకున్న కరోనా పీడ ఇప్పట్లో వదిలేలా లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరికొత్త రూపాలతో మళ్లీ మళ్లీ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది.

Corona Fourth Wave: భారత్‌లో18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్‌ డోస్‌!.. సీరం సీఈవో ఏమన్నారంటే..
Vaccine
Follow us on

Coronavirus: సుమారు రెండేళ్ల క్రితం పురుడు పోసుకున్న కరోనా పీడ ఇప్పట్లో వదిలేలా లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరికొత్త రూపాలతో మళ్లీ మళ్లీ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. మూడో వేవ్‌తో ఇక మహమ్మారి ఇంకా అంతమైపోయిందనుకుంటున్న తరుణంలో వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలోనే సరికొత్త కొవిడ్‌ వేరియంట్ విజృంభిస్తోంది. షాంఘై నగరం వైరస్‌తో అల్లాడుతోంది. వైరస్‌ ఉద్ధృతిని అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఏకంగా సైన్యాన్నే రంగంలోకి దించాల్సి వచ్చింది. వీటితో పాటు పలు యూరప్‌ దేశాల్లో కరోనా కోరలు చాస్తోన్న వేళ..సీరమ్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(SII) సీఈవో అదర్‌ పూనావాలా (Adar Poonawalla) కీలక వ్యాఖ్యలు చేశారు. బూస్టర్‌ డోసు తీసుకుంటే ఒమిక్రాన్‌, Covid Variant XE లాంటి వేరియంట్ల నుంచి భవిష్యత్‌లో రక్షణ పొందవచ్చన్నారు. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు తమ పౌరులందరికీ ఈ అదనపు టీకాలు ఇస్తున్నాయని భారత్‌లో కూడా ఈ అంశంపై దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చిందని పూనావాలా పేర్కొన్నారు. దేశంలో బూస్టర్‌ డోసు పంపిణీపై కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులతో పాటు ప్రయాణాలు చేసే ప్రతిఒక్కరికీ బూస్టర్‌ డోసు అవసరమని.. దీనిపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చిస్తోందన్నారు. బూస్టర్‌ డోసుపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సీరం సీఈవో పేర్కొన్నారు.

అందువల్లే దేశంలో కొవిడ్‌ తగ్గింది..

కాగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో దేశంలో కొవిషీల్డ్‌ టీకాను సీరమ్‌ సంస్థ తయారుచేసిన విషయం తెలిసిందే. మన దేశంలో కొవిడ్‌ నాలుగో వేవ్‌ వచ్చినా తీవ్రత తక్కువగానే ఉంటుందని పూనావాలా తెలిపారు. ‘భారత్‌ సరైన వ్యాక్సిన్లను ఎంచుకోవడం వల్లే దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తక్కువగా వస్తున్నాయి. దేశంలో అర్హులైన వారందరికీ రెండు డోసుల టీకాలు పంపిణీ చేయడంలో కేంద్రం బాగా పనిచేసింది. కరోనా కట్టడిలో ఇతర దేశాల వ్యాక్సిన్ల కన్నా మన వ్యాక్సిన్లే మెరుగని రుజువైంది. మన దేశంలో ఇప్పటికే 90 శాతం మందికి పైగా మొదటి డోసు, 76 శాతం మందికి పైగా రెండు డోసుల టీకాలు పంపిణీ చేశాం. ఇక 2.23 కోట్ల మందికి ముందు జాగ్రత్తగా ప్రికాషనరీ డోసు (బూస్టర్‌ డోసు) ఇచ్చాం. బూస్టర్‌ డోసు తీసుకోవడం వల్ల ఒమిక్రాన్‌ లాంటి కొత్త వేరియంట్ల నుంచి భవిష్యత్‌లో పూర్తి రక్షణ పొందవచ్చు’ అని సీరం సీఈవో తెలిపారు.

వారికి బూస్టర్‌ డోసు ఇవ్వాల్సి వస్తే..

కాగా మన దేశంలో జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బూస్టర్‌ డోసు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ పూనావాలా అభిప్రాయం ప్రకారం మనదేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్‌ బూస్టర్‌ డోసు ఇవ్వాల్సి వస్తే మన దేశంలో భారీ మొత్తంలో కరోనా టీకాలు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఆరోగ్య, వైద్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలోఇప్పటివరకు 184.7 కోట్ల టీకాలు పంపిణీ చేశారు. ఒకవేళ 18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్‌ డోసు పంపిణీ చేయాల్సి వస్తే.. ఇంకా 74.54 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న గణంకాల ప్రకారం మన దేశంలో యుక్త వయసు (అడల్డ్‌ పాపులేషన్‌) జనాభా 94 కోట్లు. ఇందులో 88.42 కోట్ల మందికి మొదటి డోసు టీకా ఇచ్చారు. 76.89 కోట్ల మందికి రెండో డోసు పంపిణీ చేశారు. 2.35 కోట్ల మందికి బూస్టర్‌ డోస్‌ టీకా ఇచ్చారు. వీరు పోనూ ఇంకా 74.54 కోట్ల మందికి బూస్టర్‌ డోసులు పంపిణీ చేయాల్సి ఉంటుంది.

Also Read: Sri Lanka – AP: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. ఏపీలో ప్రకంపనల పర్వం.. ఈ రెండింటికీ లింకేంటి..???

Sridevi Shobhan Babu: ‘శ్రీదేవి శోభన్ బాబు’ మూవీతో వస్తున్న సంతోష్ శోభన్.. టీజర్ లాంచ్ చేయనున్న డీజే టిల్లు

Telangana Governor: ప్రధానికి రిపోర్ట్ కార్డు ఇవ్వడం నా పని కాదు.. రాజ్‌భవన్‌కు గౌరవమివ్వాలన్న గవర్నర్ తమిళిసై..