Covid-19 Second Wave: వైద్యులపై కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో ఎంతమంది అమరులయ్యారంటే..?
Doctors Died In Covid 2nd Wave: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో
Doctors Died In Covid 2nd Wave: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. అయితే.. కోవిడ్-19 మహమ్మారిపై పోరులో ముందుండి.. నిత్యం కరోనా బాధితుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు కూడా కరోనా కాటుకు బలవుతున్నారు. గతేడాది కాలంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆసుపత్రుల్లోనే ఉంటూ నిరంతరం రోగులకు సేవలందిస్తున్న వైద్యులు చాలామంది అమరులయ్యారు. అయితే.. సెకండ్ వేవ్‌లో కూడా అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోతుండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.
గతేడాది కరోనా ఫస్ట్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు మరణించారు. తాజాగా సెకండ్ వేవ్ ప్రభావంతో ఇప్పటి వరకు 420 మంది వైద్యులు మరణించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శనివారం వెల్లడించింది. అత్యధికంగా రాజధాని ఢిల్లీలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బీహార్ రాష్ట్రంలో 96 మంది, ఉత్తరప్రదేశ్‌లో 41 మంది మృతి చెందారు. కరోనా సెకండ్ వేవ్ ప్రజలకు.. అదేవిధంగా వారి కోసం ముందుండి పోరాడుతున్న వైద్యులకు ప్రాణాంతకంగా పరిణమించిందని ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్ ఆవేదన వ్యక్తంచేశారు. అయినప్పటికీ వైద్యులు ఏమాత్రం కుంగిపోకుండా ప్రజలకే సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read: