Minister Harishrao: అధిక ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు.. రూల్స్ పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలుః హరీష్ రావు

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రిలో ఫీజులు ఉండాలని.. నిబంధనలు అతిక్రమిస్తే నోటీసులు లేకుండా ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.

Minister Harishrao: అధిక ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు.. రూల్స్ పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలుః హరీష్ రావు
Don’t Opt For Pricey Private Hospitals Says Minister Harish Rao

Minister Harishrao on Private Hospitals: ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రిలో ఫీజులు ఉండాలని.. నిబంధనలు అతిక్రమిస్తే నోటీసులు లేకుండా ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రుల అనుమతిని రద్దు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. కొత్తగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా పరిస్థితులపై రెవెన్యూ, వైద్య అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమ్మ పెట్టనూ పెట్టదు.. అడుక్కు తిననూ తిననివ్వదు అనేలా కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, సొంతంగా కంపెనీల నుంచి కొనుక్కుందామంటే ఆ సదుపాయం కూడా కల్పించలేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కొనే అంశాన్ని కేంద్రమే నిర్ణయించడం సరికాదన్నారు. రాష్ట్రానికి కావల్సిన వ్యాక్సిన్ కోసం సీఎం కేసీఆర్ వంద కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తేనే రాష్ట్రానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ టీకాలు విడుదల చేశారని హరీశ్ రావు చెప్పారు. దేశంలో సరిపడా వ్యాక్సిన్‌లు లేవని, అందుకే తాము గ్లోబల్‌ టెండర్లు పిలుస్తున్నట్లు హరీష్‌ రావు వివరించారు.

అంతకు ముందు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మూడు అంబులెన్స్ వాహనాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.. రెండు అంబులెన్స్ లను అమోజాన్ యాజమాన్యం అందించగా ఒక్క అంబులెన్స్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి సమకూర్చారు. జిల్లాకు తమ వంతు సహకారాన్ని అందించిన దాతలను మంత్రి ప్రశంసించారు.

Read Also… Ramdev Baba : అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ దేవ్ బాబా.. మండిపడుతున్న వైద్య సంఘాలు..

Click on your DTH Provider to Add TV9 Telugu