AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆక్సిజన్ థెరపీ సక్సెస్.. కోలుకున్న 396 మంది కరోనా బాధితులు..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే నలభై లక్షల మందికిపైగా ఈ వైరస్ సోకింది. వీరిలో దాదాపు పన్నెండు లక్షల మందికిపైగా కోలుకోగా.. మరో రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వైద్యులు అనేక రకాలుగా చికిత్స అందిస్తూ.. కరోనా బాధితుల ప్రాణాలను రక్షిస్తున్నారు. తాజాగా.. భోపాల్ వైద్యులు ఆక్సిజన్ థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించి.. […]

ఆక్సిజన్ థెరపీ సక్సెస్.. కోలుకున్న 396 మంది కరోనా బాధితులు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 09, 2020 | 2:02 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే నలభై లక్షల మందికిపైగా ఈ వైరస్ సోకింది. వీరిలో దాదాపు పన్నెండు లక్షల మందికిపైగా కోలుకోగా.. మరో రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వైద్యులు అనేక రకాలుగా చికిత్స అందిస్తూ.. కరోనా బాధితుల ప్రాణాలను రక్షిస్తున్నారు. తాజాగా.. భోపాల్ వైద్యులు ఆక్సిజన్ థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించి.. 396 మందిని రక్షించారు. కరోనా బారినపడ్డ బాధితులకు ఆక్సిజన్ థెరపీ అందించడం ద్వారా.. భోపాల్ చిరాయు ఆస్పత్రి డాక్టర్లు ఇప్పటి వరకు 396 మందికి ఆక్సిజన్ థెరపీ ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు. శుక్రవారం నాడు కూడా ఆస్పత్రి నుంచి మరో పద్దెనిమి మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని చిరాయు ఆస్పత్రి డైరెక్టర్ అజయ్ గొయెంకా తెలిపారు.

ఇదిలావుంటే కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారినందరినీ.. మరో పద్నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉండాలని సూచించామన్నారు. క్వారంటైన్ పూర్తైన తర్వాత.. వీరంతా తమ ప్లాస్మాను దానం చేయాలని కోరారు. కరోనా వచ్చిన వారికి త్వరగా ఆక్సిజన్ థెరపీ అందించడం ద్వారా కరోనాకు విజయవంతంగా చికిత్స అందించవచ్చని తెలిపారు. కాగా మధ్య ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరనా పాజిటివ్ కేసుల సంఖ్య 3341కి చేరింది. వీరిలో పదమూడు వందల మంది వరకు కరోనా నుంచి కోలుకోని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Follow Us
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర