30వేల మార్క్‌ను దాటిన తమిళనాడు.. ఇవాళ ఒక్కరోజే 19 మంది మృతి..

తమిళనాడు కొత్తగా మరో 1458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 30152కు చేరింది. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదయ్యాయి.

30వేల మార్క్‌ను దాటిన తమిళనాడు.. ఇవాళ ఒక్కరోజే 19 మంది మృతి..

Edited By:

Updated on: Jun 06, 2020 | 7:55 PM

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండు లక్షల మార్క్‌ దాటి.. నిత్యం వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికంగా కేసులు నమోదవతున్నాయి. తాజాగా తమిళనాడు కొత్తగా మరో 1458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 30152కు చేరింది. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదయ్యాయి. ఇక్కడ 1146 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో చైన్నై వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 19 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 251కి చేరింది. గత ఏడు రోజులుగా వరుసగా వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి 16,395 మంది డిశ్చార్జ్ అయ్యారని తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.